పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు
Advertisement
రైళ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ ను ఒంగోలు సమీపంలో దొంగలు దోచుకున్నారు. ఈ తెల్లవారుజామున రైలు ఒంగోలు రైల్వే స్టేషన్ దాటిన వెంటనే దుండగులు ఎస్2, ఎస్6 బోగీలలోకి ప్రవేశించారు. తొమ్మిది మంది మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం సూరారెడ్డి పాలెం వద్ద చైను లాగి రైలు ఆగిన వెంటనే పారిపోయారు.

జరిగిన చోరీపై ప్రయాణికులు గూడురు రైల్వే స్టేషన్ లో ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రాతా సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలు రైళ్లను ఖమ్మం జిల్లాలో దొంగలు దోచుకున్న ఘటనలు ఉన్నా అధికారులు భద్రత కల్పించడంపై శ్రద్ధ చూపించడం లేదు. ఫలితంగా చోరీలకు అడ్డుకట్ట పడడంలేదు.
Tue, Apr 09, 2013, 10:40 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View