యాక్షన్ హీరోకి మంచి బూస్టప్!

గత కొన్నాళ్లుగా విజయాలు లేక సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ కు ఇప్పుడు 'గౌతమ్ నందా' చిత్రం మళ్లీ బూస్టప్ ఇస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే వివిధ టెర్రిటరీలకు భారీ బిజినెస్ జరిగింది. నైజాం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 6.3 కోట్లకు సొంతం చేసుకున్నారు. అలాగే, సీడెడ్ నాలుగు కోట్లకు అమ్ముడుపోగా, ఓవర్సీస్ కోటిన్నర వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక శాటిలైట్ హక్కుల కోసం కూడా పెద్ద పోటీ ఏర్పడిందని, ఈ క్రమంలో ఓ చానెల్ 5.5 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకుందని సమాచారం. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం గోపీచంద్ కు మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందని అంటున్నారు.   
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
9 hours ago
Copyright © 2017; www.ap7am.com