ఆ హీరోతో నటించనంటున్న హీరోయిన్!
రణ్ బీర్ కపూర్ తో కలసి ఇక నటించేది లేదని తేల్చి చెప్పింది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్. గతంలో వీరిద్దరూ ప్రేమించుకోవడం ... కలసి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం.. తర్వాత మనస్పర్థలొచ్చి విడిపోవడం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఇటీవల వీరిద్దరూ కలసి 'జగ్గా జాసూస్' అనే చిత్రంలో నటించారు. అయితే, మళ్లీ ఏమైందోగానీ, కత్రినా ఇక అతనితో కలసి నటించనని తాజాగా చెప్పేసింది. ఈ సినిమా ప్రమోషన్లో అమ్మడు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.

"రణ్ బీర్ తో కలసి ఈ సినిమా ఎలా చేశానో నాకే తెలియదు. అతనితో చేయడం చాలా కష్టమనిపించింది. ఈ సినిమా షూటింగులో ఇక నాతో చేయనని తను చెప్పాడు. అందుకే నేను కూడా ఇక అతనితో కలసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇదే అతనితో నా చివరి సినిమా" అంటూ ఈ ముద్దుగుమ్మ కాస్త సీరియస్ గా చెప్పింది.
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
9 hours ago
Copyright © 2017; www.ap7am.com