స్టయిలిష్ ఫైట్ చేస్తున్న పవన్!
మాస్ హీరోల సినిమాలంటేనే యాక్షన్ నిండుగా వుంటుంది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే చెప్పేక్కర్లేదు. వినూత్నంగా వుండే ఆయన ఫైట్లను చూడడానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్ కి వస్తారు. అందుకే, ఆయన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లను ఎప్పటికప్పుడు కొత్తగా... థ్రిల్లింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రంలో కూడా అలాగే ఫైట్ సీన్లను కొత్తగా చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదులో వేసిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం పవన్, విలన్ బృందంపై ఓ స్టయిలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేశ్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం టైటిల్ని ప్రకటిస్తారు.    
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
9 hours ago
Copyright © 2017; www.ap7am.com