వెండితెరకు సూపర్ స్టార్ కృష్ణ మనవడు!
సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. కృష్ణ మనవడు, హీరో సుధీర్ బాబు తనయుడు దర్శన్ వెండితెర మీదకు వస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న 'శమంతకమణి' చిత్రంలో సుధీర్ బాబు ఒక హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం ద్వారా సుధీర్ తనయుడు దర్శన్ బాలనటుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే సందర్భంగా సుధీర్ బాబు ప్రకటించాడు. ఈ సినిమా ద్వారా జూనియర్ కృష్ణను పరిచయం చేస్తున్నామంటూ ఆయన తెలిపారు. అలాగే తాను, దర్శన్ వున్న శమంతకమణి ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ తో పాటు ఆది, నారా రోహిత్, సందీప్ కిషన్ ఇతర హీరోలుగా నటిస్తున్నారు.    
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
Copyright © 2017; www.ap7am.com