బోయపాటికి నాగ్ భారీ ఆఫర్!
అఖిల్ అక్కినేని హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రస్తుతం ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీని తర్వాత అఖిల్ నటించే మూడో చిత్రాన్ని కూడా నాగార్జున అప్పుడే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టు కోసం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చిత్రం కోసం బోయపాటికి 12 కోట్ల వరకు ఇవ్వడానికి నాగార్జున భారీ ఆఫర్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అఖిల్ ని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలంటే బోయపాటి లాంటి డైరెక్టర్ అవసరమని భావించే, అంత మొత్తం ఇవ్వడానికి నాగార్జున నిర్ణయించారట. ఈ చిత్రం చేయడానికి బోయపాటి సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు.   
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
Copyright © 2017; www.ap7am.com