విలన్ గా నిన్నటితరం కథానాయకుడు!
ఒకప్పుడు హీరోలుగా రాణించిన నటులు కాలక్రమంలో విలన్ పాత్రలు కూడా పోషించారు. ప్రస్తుతం ఆ కోవలో జగపతిబాబు, అరవింద్ స్వామి వంటి ఆర్టిస్టులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఒకప్పటి రొమాంటిక్ హీరో కార్తీక్ కూడా ఇప్పుడు విలన్ గా మారాడు. ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య నటిస్తున్న చిత్రంలో కార్తీక్ ఇలా విలన్ గా నటిస్తున్నాడు. సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సేర్న్ దా కూట్టం' అనే తమిళ సినిమా రూపొందుతోంది. ఇందులో కార్తీక్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది విలనిజంతో కూడిన పాత్ర అంటూ తాజాగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సూర్య, కార్తీక్ మధ్య నడిచే కొన్ని కీలక సన్నివేశాలను ఈ చిత్రం కోసం చిత్రీకరిస్తున్నారు.       
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
Copyright © 2017; www.ap7am.com