నాటి మహానటుడి పాత్రలో ప్రకాశ్ రాజ్!
తెలుగు సినీ నటులలో మహానటులు అనదగ్గ అతి కొద్దిమందిలో ఎస్వీ రంగారావు ఒకరు. ఏ తరహా పాత్రనైనా సరే తనదైన శైలి ముద్రతో రక్తి కట్టించగల ప్రతిభాశాలి ఆయన. అలాంటి ఎస్వీఆర్ పాత్రను ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 'మహానటి' పేరిట సావిత్రి జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్వీఆర్ కూడా కొన్ని సన్నివేశాలలో కనిపిస్తారట. దాంతో ఎంతోమందిని పరిశీలించిన మీదట ప్రకాశ్ రాజ్ ని ఎంచుకుని ఆయనను సంప్రదిస్తున్నట్టు, అందుకు ఆయన కూడా సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్, జెమినీ గణేషన్ గా దుల్ఖర్ సల్మాన్ నటిస్తుండగా.. సమంత మరో కీలక పాత్ర పోషిస్తోంది.  
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
Copyright © 2017; www.ap7am.com