'గరుడ వేగ'లో యంగ్ హీరో!
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'గరుడ వేగ' సినిమా రూపొందుతోంది. పూజా కుమార్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిరంజన్ అనే సాంకేతిక నిపుణుడి పాత్రను 'అదిత్' చేస్తున్నాడు. గతంలో అదిత్ 'కథ' .. 'తుంగభద్ర' చిత్రాల్లో హీరోగా నటించాడు. 'గరుడ వేగ'లో అదిత్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు.

 రాజశేఖర్ తో సమానంగా సినిమా అంతా అదిత్ పాత్ర రన్ అవుతూ ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ - అదిత్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా వుంటాయని అన్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కి ఈ ఇద్దరూ ప్రాణం పోశారని చెప్పారు. అదిత్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.       
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
Copyright © 2017; www.ap7am.com