సూర్య జోక్యం లేదన్న జ్యోతిక!
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకు మంచి గుర్తింపు వుంది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టిన జ్యోతిక, తన వయసుకి తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. ఇటీవల ఆమె విజయ్ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. అందుకు సూర్య కారకుడని చెప్పుకున్నారు. తాజాగా ఆ విషయాన్ని గురించి జ్యోతిక స్పందించారు.

 తాను ఓకే చెప్పిన రెండు సినిమాలు ఒకేసారి మొదలయ్యాయనీ .. అందులో ఒకటి విజయ్ హీరోగా చేస్తున్నదని అన్నారు. డేట్స్ సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో ఆలోచనలో పడ్డానని చెప్పారు. పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని .. విజయ్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇందులో సూర్య ప్రమేయం ఎంత మాత్రం లేదనీ .. తాను తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు.     
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com