భారీ స్థాయిలో 'గౌతమ్ నంద' బిజినెస్!
సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్లో 'గౌతమ్ నంద ' సినిమా తెరకెక్కుతోంది. హన్సిక - కేథరిన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై గల క్రేజ్ కారణంగా బిజినెస్ ఊపందుకుందని చెబుతున్నారు.

ఆంధ్రా ఏరియా హక్కులు 9.5 కోట్లకి అమ్ముడైనట్టు సమాచారం. నైజాం .. సీడెడ్ ఏరియా హక్కులకు సంబంధించిన బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. అది పూర్తయితే మొత్తం 30 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ .. శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే 40 కోట్ల మార్క్ ను చేరుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాతో తమకి హిట్ పడటం ఖాయమనే కాన్ఫిడెంట్ తో గోపీచంద్ - సంపత్ నంది వున్నారు.  
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
Copyright © 2017; www.ap7am.com