నేటి వార్తలు ... టూకీగా
*  ఇప్పుడు మనసుకి నచ్చిన కథలను మాత్రమే ఒప్పుకుంటున్నాను..' అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. "కెరీర్ మొదట్లో నిలబడడం కోసం ఎలాంటి కథలు వస్తే అవే ఒప్పుకున్నాను. అసలు నేనే కాదు కొత్తగా వచ్చిన వాళ్లు ఎవరైనా సరే అలాగే చేస్తారు. అయినా నేను చేసిన వాటిలో చెడ్డవి మాత్రం లేవు. ఇక ఇప్పుడు మాత్రం బాగా నచ్చిన కథలనే ఎంచుకుంటున్నాను. ఈ విషయంలో మొహమాటం పడడం లేదు' అని చెప్పింది సమంత.        
*  అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన 'డీజే' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
*  ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో ముగిసింది. మరో షెడ్యూలును ఈ నెలాఖరు నుంచి విశాఖ, అరకు చుట్టుపక్కల ప్రాంతాలలో నిర్వహిస్తారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.     
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com