బోయపాటికి నాగ్ భారీ ఆఫర్?
నాగచైతన్యకి స్టార్ స్టేటస్ తీసుకురావడానికి నాగార్జున తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 'ప్రేమమ్'తో హిట్ అందుకున్న చైతూకి, భారీ హిట్ ను ఇవ్వడం కోసం 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ సినిమా విజయంతో స్టార్ స్టేటస్ కి చైతూ మరింత చేరువగా వచ్చాడు. ఈ సమయంలోనే ఒక బ్లాక్ బస్టర్ పడాలనే ఉద్దేశంతో, బోయపాటిని నాగ్ సంప్రదించినట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ తరువాత బోయపాటి ఫ్రీ అవుతాడు కనుక, చైతూతో ఓ ప్రాజెక్టు చేయమని నాగ్ కోరాడట. ఇందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు వినికిడి. బోయపాటి కూడా ఇందుకు సుముఖంగానే వున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి.   
5 hours ago
5 hours ago
6 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
7 hours ago
8 hours ago
8 hours ago
8 hours ago
Copyright © 2017; www.ap7am.com