యంగ్ హీరోతో మరో మూవీ మొదలు!
యంగ్ హీరో సందీప్ కిషన్ ను సరైన సక్సెస్ లు పలకరించడం లేదు గానీ, అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆయన హీరోగా చేసిన 'నక్షత్రం' .. 'కేరాఫ్ సూర్య' .. 'శమంతకమణి' సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమాను అంగీకరించాడు.

 ఇప్పటివరకూ యూత్ ను ..  మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వచ్చిన సందీప్, ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటం విశేషం. 'కిట్టు వున్నాడు జాగ్రత్త' తో హిట్ కొట్టిన వంశీకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రూపేష్ డి. గోహిల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చేనెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ, చాలావరకూ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుందని చెప్పుకొచ్చాడు.     
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
Copyright © 2017; www.ap7am.com