ఫ్యాన్స్ కిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే!
వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ నారా రోహిత్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 'కథలో రాజకుమారి' .. 'వీరభోగ వసంతరాయలు' .. 'పండగలా వచ్చాడు' వంటి సినిమాలను వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన వున్నాడు.

మొదటి నుంచి కూడా తన బరువు విషయంలో కామెంట్స్ ను ఎదుర్కుంటూ వస్తోన్న నారా రోహిత్, ఇకపై బరువు తగ్గేస్తానంటూ ఆ మధ్య ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వస్తున్నాడట. అలా ఆయన ఇంతవరకూ 15 కేజీల బరువు తగ్గాడని అంటున్నారు. ఈ స్లిమ్ లుక్ తోనే ఆయన ' శమంతక మణి'లో కనిపించనున్నాడని చెబుతున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ కిచ్చిన మాటను నారా రోహిత్ నిలబెట్టుకున్నాడన్న మాట.  
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com