రకుల్, కేథరిన్ రెడీ అవుతున్నారు!
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ - నోవాటెల్ హోటల్లో ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డుల ఫంక్షన్లో ఏయే కేటగిరీల్లో ఎవరికి అవార్డులు వస్తాయనే దానికంటే, అందాల తారల్లో ఎవరు స్టేజ్ ఫెర్ఫామెన్స్ ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వేదికపై రకుల్ .. కేథరిన్ ఇచ్చే ఫెర్ఫా మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. రకుల్ .. కేథరిన్ తో పాటు, శ్రద్ధా శ్రీనాథ్ .. మంజిమా మోహన్ .. నిక్కీ గల్రాని కూడా కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ తారలంతా కూడా ఇప్పటికే రిహార్సల్స్ ను పూర్తి చేసి, రంగంలోకి దిగే సమయం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.   
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
Copyright © 2017; www.ap7am.com