ఇక రకుల్ పై షూట్ చేస్తారట!
'స్పైడర్' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మహేశ్ బాబును కొరటాల ప్రాజెక్టుకి పంపించాలి కనుక, ఆయనకి సంబంధించిన సన్నివేశాలను ముందుగా లాగించేస్తున్నారు. ఇక రకుల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు 15 .. 20 రోజులు పట్టొచ్చని అంటున్నారు. ఈ నెల చివరికి రకుల్ కి సంబంధించిన పోర్షన్ ను కూడా పూర్తి చేయాలని ఈ సినిమా టీమ్ భావిస్తోంది.

ఆమె సీన్స్ ను షూట్ చేస్తే, ఈ సినిమా రెండు పాటల మినహా టాకీ పార్టును పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మహేశ్ చెప్పడం వలన, ఆ దిశగానే పనులను వేగవంతం చేశారు. టీజర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి .. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేశ్ అభిమానులు భావిస్తున్నారు. ఇక రకుల్ కూడా తనకి హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో వుంది. 
12 hours ago
13 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com