ముందుగా కోలీవుడ్లోనే చేస్తుందట!
రాజశేఖర్ - జీవిత పెద్ద కూతురు శివాని వెండితెరకి పరిచయం కానున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. దాంతో ఈ అమ్మాయి తెలుగు సినిమానే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ తన మొదటి సినిమా కోలీవుడ్ లో ఉంటుందని తాజాగా శివాని చెప్పింది. ప్రస్తుతం తాను వైద్య విద్యను అభ్యసిస్తున్నాననీ, చదువు అయిన తరువాతనే కథానాయికగా ప్రయత్నించమని తల్లిదండ్రులు చెప్పారని అంది.

 తనకి భరతనాట్యంలోను .. కూచిపూడిలోను ప్రవేశం ఉందని చెప్పింది. కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నానని అంది. తనకి తమిళ భాష బాగా వచ్చని చెబుతూ .. తొలి సినిమా తమిళంలోనే ఉంటుందని చెప్పింది. తమిళంలో ధనుష్ .. విశాల్ .. విజయ్ సేతుపతి నటనంటే తనకి  చాలా ఇష్టమని అంది. మొత్తానికి శివాని అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందన్న మాట.    
12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com