దేవాలయంలో సాష్టాంగ నమస్కారం
దేవాలయానికి వెళ్లిన భక్తుల్లో కొందరు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. దైవానికి ఎదురుగా చేతులు సాచి దేహాన్ని పూర్తిగా నేలకి తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజ స్థంభం దగ్గరే చేయాలనే నియమమొకటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది.

సాష్టాంగ నమస్కారం ధ్వజ స్థంభం దగ్గర చేయడం వలన, ఆ నమస్కారం తప్పకుండా ప్రధాన దైవానికి చేరుతుంది. అంతే కాకుండా సాష్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ల భాగం దిశలో ఎలాంటి దేవతా మూర్తులు వుండవు. ఆలయంలోని ముఖ మంటపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు. కాళ్లు .. ఆ దైవం వాహనం వైపుకు వస్తాయి. కొన్ని ఆలయాల్లో ముఖ మంటపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్లు ఉపాలయాల వైపు ఉంటాయి. అందువల్లనే ఎలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు .. ఉపాలయాల వైపు కాళ్లు పెట్టకుండా ఉండటం కోసం, ధ్వజ స్థంభం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయవలసి ఉంటుంది.
Wed, May 22, 2019, 06:23 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View