విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం
జీవితమన్నాక ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి .. మరెన్నో సమస్యలు పలకరిస్తుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు .. అనారోగ్య కారణాలు మానసికంగా కుంగదీస్తుంటాయి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడానికి, పూర్వజన్మలో చేసిన పాపాలే కారణమనేది పెద్దల మాట. పాపాలను హరించే శక్తి భగవంతుడి నామానికి వుంది. అందువలన అనునిత్యం దైవ నామస్మరణ చేస్తుండాలని పెద్దలు చెబుతుంటారు.

ఇక కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సమయంలో, విష్ణు సహస్రనామ పారాయణానికి మించిన విరుగుడు లేదని అంటారు. జీవితంలో రకరకాల సమస్యలు సతమతం చేస్తున్నప్పుడు, అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ విధంగా చేయడం వలన కష్టాలు .. బాధలు .. వ్యాధులు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ .. ఉత్తమగతులు కలుగుతాయనేది మహర్షుల మాట. 
Thu, May 09, 2019, 06:00 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View