దారిద్ర్య దుఃఖాలను తొలగించే దుర్గాదేవి
జీవితంలో కష్టాలు రావడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి కష్టాలన్నీ కలిసి ఒకేసారి వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతూ వుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు .. అనారోగ్య సమస్యలు .. ఆపదలు ఎదురై సతమతం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి నానా కష్టాలు పడవలసి వస్తుంటుంది. నిరాశా నిస్పృహలకిలోనై మానసికంగా కుంగిపోతుంటారు.

దైవానుగ్రహం వలన ఎలాంటి కష్టనష్టాలైనా తొలగిపోతుంటాయి. దుర్గాదేవిని ఆరాధించడం వలన, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దుర్గాదేవి అంటేనే దుర్గతులను నశింపజేసేది అని అర్థం. అలాంటి అమ్మవారిని అనునిత్యం అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వలన .. ప్రతి శుక్రవారం అభిషేకాలు జరిపించడం వలన కష్టాలన్నీ కరిగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. దుర్గాదేవిని అంకితభావంతో ఆరాధించడం వలన .. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన దారిద్ర్య దుఃఖాలు .. ఆపదలు తొలగిపోతాయనేది మహర్షుల మాట.   
Wed, Apr 24, 2019, 05:34 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View