రుణ బాధల నుంచి విముక్తిని కలిగించే నవగ్రహ స్తోత్రం
ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ప్రధానమైన అంశాల్లో డబ్బు ఒకటి. డబ్బుతో అన్నీ కొనలేం అనే మాటను వింటూ ఉంటాము .. డబ్బే ప్రధానం కాదని అంటూ ఉండటం కూడా వింటూ ఉంటాము. అవి నిజమే అయినా డబ్బుకున్న ప్రాముఖ్యతను కాదనలేం. అవసరాల నుంచి .. ఆపదల నుంచి కాపాడే శక్తి డబ్బుకి వుంది. అవమానాలపాలు కాకుండా ఆత్మాభిమానం కాపాడే శక్తి కూడా డబ్బుకు వుంది. అందువల్లనే చాలామంది డబ్బును ముందుచూపుతో పొదుపు చేస్తుంటారు .. అత్యవసరాలకి వాటికి బయటికి తీస్తుంటారు.

అవసరానికి డబ్బులేనప్పుడు ఎవరైనా అప్పు చేయవలసిందే. ఎదురుగా వున్న గండం నుంచి గట్టెక్కడం గురించే ఎవరైనా ఆలోచిస్తారు. అలా అవసరం కోసం చేసిన అప్పును తీర్చలేని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. దాంతో మాట పోతుందేమోనని మానసికంగా కుంగిపోయేవాళ్లు చాలామందే వుంటారు. అలాంటివాళ్లు అనునిత్యం నియమనిష్టలతో 'నవగ్రహ స్తోత్రం' పఠించడం వలన, 'రుణ విముక్తి' కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువలన అప్పుల బాధలతో సతమతమయ్యేవాళ్లు 'నవగ్రహ స్తోత్రం' పఠించడం మంచిది.  
Tue, Apr 16, 2019, 05:16 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View