వరాలనిచ్చే నాగమ్మ తల్లి క్షేత్రం
సాధారణంగా చాలా ఆలయాల్లో నాగదేవతల మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని దేవాలయాలలో పుట్టలకి కూడా నాగ పూజలు చేస్తూ వుంటారు. అయితే ఒక నాగుపాము నేరుగా వచ్చి ఒకే ప్రదేశంలో కొన్ని రోజుల పాటు వుండి .. అక్కడే ఆవిర్భవించిన క్షేత్రంగా 'వరాల నాగమ్మ తల్లి' క్షేత్రం కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం .. 'గంటి' గ్రామంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.

కొంతకాలం క్రితం స్వయంగా నాగుపాము వచ్చి తేజస్సును ఆవిష్కరిస్తూ ఎక్కడైతే ఆవిర్భవించిందో .. అక్కడే ఆలయాన్ని నిర్మించారు. పచ్చని పంటపొలాల మధ్య .. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం వెలుగొందుతోంది. గర్భాలయంలో నాగదేవత రూపం .. పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి మంగళవారం అభిషేకం జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సర్పదోషాలు .. కుజ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
Wed, Apr 03, 2019, 05:37 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View