పంచముఖ హనుమను పూజించడం వలన ఫలితం
ప్రతి రామాలయంలో హనుమంతుడు ఉంటాడు .. రామ నామం వినిపించే ప్రతి చోటున హనుమంతుడు ఉంటాడు. వీరాంజనేయుడిగా .. ప్రసన్నాంజనేయుడిగా .. దాసాంజనేయుడిగా .. ఇలా అనేక నామాలతో .. వివిధ ముద్రలతో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. ఇక కొన్ని ప్రదేశాల్లో పంచముఖ హనుమంతుడు కొలువై ఉంటాడు.

మధ్యలో హనుమ ముఖం ఉండగా, మిగతా నాలుగు ముఖాలుగా నారసింహ ముఖం .. గరుత్మంత ముఖం .. వరాహ ముఖం .. హయగ్రీవ ముఖం కనిపిస్తాయి. పంచముఖ హనుమంతుడిని దర్శించడం వలన .. పూజించడం వలన .. సేవించడం వలన ఈ అయిదుగురు దైవాల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హనుమ అనుగ్రహంతో బలం .. నరసింహస్వామి వలన సంపదలు .. గరుత్మంతుడి వలన కార్యసాధన .. వరాహస్వామి వలన ఆరోగ్యం .. హయగ్రీవస్వామి వలన విజయం లభిస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 
Fri, Mar 29, 2019, 05:32 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View