ఆపదలను తొలగించే శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచమ్
త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయస్వామి దేవతలకు .. మహర్షులకు జ్ఞానాన్ని భోదించాడు. తన భక్తులు స్మరించినంత మాత్రాన్నే ఏదో ఒక రూపంలో వాళ్ల చెంతకి చేరుకొని రక్షించిన కథలు వాళ్ల అనుభవాలుగా మనకి వినిపిస్తాయి. దత్తాత్రేయస్వామి నామస్మరణం .. దత్తాత్రేయస్వామి 'వజ్ర కవచమ్' మహాశక్తిమంతమైనవి. ప్రతి గురువారం 'దత్తాత్రేయస్వామి వజ్ర కవచమ్' పఠించడం వలన ఆపదలు .. అనారోగ్యాలు .. అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ఎవరైతే అనునిత్యం 'దత్తాత్రేయ వజ్ర కవచం' భక్తి శ్రద్ధలతో .. నియమ నిష్టలతో పఠిస్తూ వుంటారో, అలాంటివారిని ఆ స్వామి ఒక రక్షణ కవచం మాదిరిగా కాపాడుతూ ఉంటాడు. దత్తాత్రేయ వజ్ర కవచమ్ పఠించడం వలన దీర్ఘాయువు కలుగుతుంది .. సిరి సంపదలు చేకూరతాయి. ఎలాంటి ఉపద్రవాలనుంచైనా బయటపడే శక్తి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పఠించడం వలన కలుగుతుందనేది మహర్షుల మాట. అందువలన అనునిత్యం దత్తాత్రేయస్వామి వజ్ర కవచాన్ని పఠించడం మంచిది.   
Fri, Mar 22, 2019, 05:39 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View