విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం
జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు చుట్టుముట్టి సతమతం చేస్తుంటాయి. అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాలు అయోమయానికి గురిచేస్తుంటాయి. వ్యాధులు .. బాధలు నిరాశా నిస్పృహలకు లోను చేస్తుంటాయి. ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక అంతా కుంగిపోతుంటారు. అన్నిరకాల కష్టాల నుంచి ..  బాధల నుంచి .. ఆపదల నుంచి బయటపడేయగలిగే శక్తి విష్ణుసహస్రనామానికి ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

అనునిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన, ప్రతి విషయంలోను చిక్కులు విడిపోతాయి. ప్రమాదాలు .. ఆపదలు తొలగిపోతాయి. ఆర్ధిక పరమైన .. ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవుతాయి. సమస్త పాపాలు దహించబడి .. సకల శుభాలు కలుగుతాయి. అందువలన అనునిత్యం విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మరువకూడదు.
Fri, Mar 15, 2019, 07:14 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View