హనుమకు ప్రదక్షిణలు చేస్తే కలిగే ఫలితం
హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో.. అంతటి వినయ సంపన్నుడు. అష్ట సిద్ధులు తెలిసిన బుద్ధిశాలి. శ్రీరామ అంటే ఆయనకంటే ముందుగా పలికే భక్తాగ్రేసరుడు. అలాంటి హనుమంతుడిని అంకితభావంతో సేవిస్తే చాలు కరిగిపోతాడు. ఆకుపూజ చేయించి .. తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పిస్తే చాలు పొంగిపోతాడు. ఇక తన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేసే భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఆయన ఎంత మాత్రం ఆలస్యం చేయడు.

అనారోగ్యంతో బాధలు పడుతున్నవారు .. దుష్ట శక్తుల వలన పీడించబడుతున్నవారు .. గ్రహ దోషాలచే అవస్థలు పడుతున్నవారు .. తలపెట్టిన కార్యాలు పూర్తికాక ఇబ్బందులు పడుతున్నవారు .. హనుమంతుడికి అనునిత్యం ప్రదక్షిణలు చేయడం వలన ఆశించిన ఫలితం వెంటనే కనిపిస్తుంది. అనునిత్యం ప్రదక్షిణలు చేయడం కుదరని పక్షంలో ప్రతి మంగళవారం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. హనుమంతుడిని పూజిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్టే .. ఆయా దేవతల అనుగ్రహాన్ని పొందినట్టే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   
Tue, Mar 12, 2019, 05:37 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View