నీలం శంఖం పూలతో శనిదేవుడికి పూజ
శని దోషం అనగానే ఎంతటివారైనా కంగారు పడిపోతారు .. ఎలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన చెందుతారు. శని దోషం నుంచి విముక్తిని పొందడానికి ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్లు చేస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ దోషం నుంచి బయటపడాలని చూస్తారు. శనిదానాలు ఇవ్వడం .. స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చేస్తుంటారు.

 అయితే నవగ్రహాలలో శనీశ్వరుడిని నీలం రంగులో కనిపించే శంఖం పూలతో పూజించడం వలన కూడా శని దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శంఖం పూలతో పూజ చేయడం వలన శనీశ్వరుడు ప్రీతి చెందుతాడట. ఆయన ప్రీతి చెందడం వలన .. శని దోషం చూపించే తీవ్రమైన ప్రభావం తగ్గుతూ వస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన శని దోషంతో నానా ఇబ్బందులు పడేవాళ్లు, శనీశ్వరుడిని అనునిత్యం నీలం రంగు శంఖం పూలతో పూజించాలనే విషయాన్ని మరిచిపోకూడదు.   
Sat, Mar 09, 2019, 06:06 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View