లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం
శ్రీరామచంద్రుడు .. రావణుడిని సంహరించిన తరువాత, ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి గాను కోటి శివలింగాలను ఆయా ప్రదేశాలలో ప్రతిష్ఠ చేయమని మహర్షులు సెలవిస్తారు. దాంతో శ్రీరాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. అలా రాముడు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు 'రామలింగేశ్వర' క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

ఇక 'లక్ష్మణేశ్వరుడు'గా ఆ పరమ శివుడు పూజలందుకునే క్షేత్రం మనకి 'బెల్లంపూడి'లో కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా .. రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని లక్ష్మణుడు ప్రతిష్ఠ చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. శ్రీరాముడికి అందజేయడానికి శివలింగాన్ని తెస్తూ .. ముహూర్త సమయం మించిపోతుండటంతో లక్ష్మణుడే ఈ ప్రదేశంలో ప్రతిష్ఠ చేసేశాడని చెబుతారు. అందువల్లనే ఇక్కడి శివుడు లక్ష్మణేశ్వరుడుగా పిలవబడుతుంటాడు .. కొలవబడుతుంటాడు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి శివాలయం పక్కనే రామాలయం కూడా దర్శనమిస్తూ ఉంటుంది.
Sat, Feb 16, 2019, 06:47 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View