నారద సరస్సు .. ముక్తికా సరస్సు
కాకినాడ సమీపంలోని 'సర్పవరం' క్షేత్రంలో 'భావనారాయణ స్వామి'కొలువై దర్శనమిస్తుంటాడు. ఇక్కడి రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామిని నారద మహర్షి ప్రతిష్ఠ చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. శ్రీమహావిష్ణువు లీలావిశేషం కారణంగా ఇక్కడ ఏర్పడిన సరస్సులో నారదుడు స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందుతాడు. ఆ తరువాత నానా బాధలుపడి .. తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం 'విష్ణు మాయను కనుగొనగలను' అనే అహంకారానికి లోను కావడమేనని గ్రహిస్తాడు.

నారద స్త్రీ తన తప్పు తెలుసుకోవడంతో, ఆ సరస్సు పక్కనే శ్రీ మహావిష్ణువు మరో సరస్సును సృష్టించి అందులో స్నానం  చేయమని చెబుతాడు. అలా అందులో స్నానం చేసిన అనంతరం నారద మహర్షికి పూర్వ రూపం వస్తుంది. అందువల్లనే దీనిని ముక్తికా సరస్సు గా పిలుస్తారు. 'సర్పవరం' భావనారాయణస్వామి దేవాలయం రాజగోపురానికి ఎదురుగా ఇప్పటికీ ఈ రెండు సరస్సులు కనిపిస్తుంటాయి. 
Fri, Feb 15, 2019, 06:26 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View