లక్ష్మీదేవికి ఆవునెయ్యితో అభిషేకం .. ఫలితం
జీవితంలో డబ్బుతో అన్నిటినీ కొనలేకపోవచ్చు .. డబ్బుతో అన్నిటినీ సాధించుకోలేకపోవచ్చు. కానీ డబ్బుతోనే చాలా అవసరాలు తీరతాయి .. ఆపదలు గట్టెక్కుతాయి. ఆయా సందర్భాలలో అవమానాలపాలు కాకుండా చేసే శక్తి కూడా డబ్బుకి వుంది. అందువలన డబ్బు విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ వుంటారు. ఎవరు ఎంత కష్టపడి సంపాదించినా, ఆ ధనం స్థిరంగా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఆ తల్లికి ప్రీతిని కలిగించేలా పూజించాలి .. అంకితభావంతో ఆరాధించాలి. లక్ష్మీదేవి ప్రీతి చెందాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా .. పవిత్రంగా ఉండాలి. అంతేకాదు ఆ ఇంట్లోని వాళ్లంతా అసత్యానికి .. అధర్మానికి దూరంగా ఉంటూ ఉండాలి. ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి .. పూజా మందిరాన్ని పూలతో అలంకరించాలి. ఆ తల్లిని ఆవు నెయ్యితోగానీ .. చెరుకు రసంతో గాని అభిషేకిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి ప్రీతి చెందుతుందనీ .. సిరి సంపదలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.     
Fri, Feb 08, 2019, 06:16 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View