దేవేంద్రుడికి శాప విముక్తి కలిగిన క్షేత్రం
తమిళనాడులోని ప్రాచీన క్షేత్రాలలో 'సుచీన్ద్రం' ఒకటిగా కనిపిస్తుంది. అనసూయ మాత పాతివ్రత్య నిరూపణ జరిగిన పరమ పవిత్రమైన పుణ్యస్థలిగా 'సుచీన్ద్రం' గురించి చెబుతారు. ఈ క్షేత్రంలో ఒకే లింగంలో త్రిమూర్తులు ఉండటం విశేషం. లింగానికి పై భాగంలో విష్ణుమూర్తి .. మధ్య భాగంలో శివుడు .. క్రింది భాగంలో బ్రహ్మ దర్శనమిస్తారు. అభిషేకం జరుగుతున్నప్పుడు త్రిమూర్తులను భక్తులు తిలకించవచ్చు.

ఈ దేవాలయాన్ని సాక్షాత్తు దేవేంద్రుడే నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. 'అహల్య' విషయంలో గౌతముడిచే దేవేంద్రుడు శపించబడతాడు. ఇంద్రుడు ప్రాధేయపడటంతో .. త్రిమూర్తులు ఒకే చోట వెలసిన క్షేత్రంలో తపస్సు చేయమనీ, ఫలితంగా వాళ్ల అనుగ్రహంతో శాపవిముక్తి కలుగుతుందని గౌతముడు సెలవిస్తాడు. దాంతో ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సుచే త్రిమూర్తులను మెప్పించి, శాపం నుంచి విముక్తిని పొందుతాడు. శాపం తొలగిపోయి ఇంద్రుడు 'శుచి' అయిన కారణంగానే ఈ క్షేత్రానికి ' సుచీన్ద్రం' అనే పేరు వచ్చిందని చెబుతారు. 
Wed, Jan 30, 2019, 06:00 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View