వేంకటేశ్వరస్వామిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం
విష్ణు స్వరూపమైన వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామిని పూజించడం వలన కష్టాల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. కష్టాలను తీర్చువాడే వేంకటేశ్వరుడు అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వేంకటేశ్వరస్వామి దర్శన మాత్రం చేతనే పాపాలు పటాపంచలైపోతాయి .. దోషాలు తొలగిపోతాయి. అలాంటి ఆ స్వామిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి ప్రీతి చెందుతుంది.

వేంకటేశ్వరస్వామి హృదయ స్థానంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కనుక వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ప్రతివారికి లక్ష్మీదేవి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు కూడా భక్తులపై ప్రసరించబడతాయి. ఇక తనని పూజించడం వలన సంతోషించే అమ్మవారు, స్వామివారిని పూజించేవారి పట్ల మరింత కరుణ చూపుతుందట. స్వామిని అంకితభావంతో సేవించేవారి ఇంట లేమి అనేది లేకుండా చూస్తుందట. అలాంటివారి దరిదాపులకు దారిద్ర్యం .. దుఃఖం రాకుండా చేస్తుందనేది మహర్షుల మాట. అమ్మవారి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వలన, ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది.
Tue, Jan 08, 2019, 06:31 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View