దానం వల్లనే ధనవృద్ధి
ఎవరైనా సరే తాము సంపాదించిన మొత్తంలో కొంత దానం చేయాలి .. మరికొంత దైవకార్యాలకి వినియోగించాలి. నదీ తీరాల్లో .. పుణ్య క్షేత్రాల్లో దానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే కొంతమంది దానాలు చేయడానికి ఇష్టపడరు. దానం చేయకపోగా అడిగినవారిని తక్కువచేసి మాట్లాడుతుంటారు. అహంభావంతో వ్యవహరించేవారు సైతం లేకపోలేదు. ఇలా దానం చేయనివారిపట్ల .. అహంభావంతో వ్యవహరించేవారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఒకవేళ సమయానికి దానం చేయలేనప్పుడు ఆ విషయాన్ని సున్నితంగా చెప్పాలే గానీ కసురుకోకూడదు. శిరిడీ సాయిబాబా చెప్పింది కూడా ఇదే. ఎవరైతే మంచి మనసుతో దానాలు చేస్తూ వుంటారో వాళ్లకి ధనవృద్ధి కలిగేలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దానం వల్లనే ధనవృద్ధి కలుగుతుంది కనుక, నిస్సహాయులకు .. పేదవారికి దానాలు చేయాలి. ఇక ఎవరైతే భోజనానికి ముందు .. తొలి ముద్దకి భగవంతుడిని తలచుకుంటారో, ఆకలి బాధ అనేది వాళ్ల దరిచేరకుండా అమ్మవారు చూస్తుందనేది మహర్షుల మాట.         
Mon, Dec 31, 2018, 06:18 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View