సేవ వల్లనే భగవంతుడి అనుగ్రహం
జీవితంలో ఎవరైనా సరే తమ కోరికలను నెరవేర్చుకునే శక్తి తమకి లేనప్పుడు, వాటిని తీర్చవలసిన భారం భగవంతుడిపైనే వేస్తుంటారు. ఇక ఆపదల నుంచి బయటపడటమనేది భగవంతుడి చేతిలోనే ఉంటుంది గనుక ఆయననే ఆశ్రయిస్తుంటారు. భగవంతుడి మనసు గెలుచుకుంటే, ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది.

అందుకోసం నిస్సహాయులకు సహకారాన్ని అందించాలి. మూగ జీవాలకు ఆహారాన్ని అందించాలి. అలాగే ఆలయంలో భగవంతుడికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. భగవంతుడికి సంబంధించిన వస్తు సామగ్రిని శుభ్రం చేయడం .. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం .. వాకిలి తుడిచి ముగ్గులు పెట్టడం .. ఆలయ ద్వారానికి తోరణాలు కట్టడం .. పూల దండాలు సమర్పించడం .. వాహన సేవల్లో సహకారిగా ఉంటూ భగవంతుడి సేవకుడిగా శ్రమిస్తూ ..ఆ శ్రమలో సంతోషాన్ని .. సంతృప్తిని పొందాలి. అలాంటి వారి కోరికలను ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు.  
Sat, Dec 29, 2018, 06:18 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View