రుణ విముక్తిని కలిగించే గజేంద్ర మోక్షం పారాయణం
అప్పు .. నిప్పులాంటిదనీ .. ముప్పు తెస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయినా కొంతమంది ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తుంటారు. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తుంటారు. మరికొంతమంది అప్పు చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటూ వుంటారు. అయితే ఒక్కోసారి అనుకోని అవాంతరాలు .. ఆపదలు వచ్చి మీద పడుతుంటాయి. అప్పుడు చేతిలో తగినంత డబ్బులేకపోవడం వలన అప్పు చేయవలసి వస్తుంది.

చేయక చేయక అప్పు చేసినవాళ్లు ఆ అప్పును సాధ్యమైనంత త్వరగా తీర్చేయడానికి తొందరపడుతుంటారు. అప్పటివరకూ తమకి మనశ్శాంతి లేదన్నట్టుగా వుంటారు. అప్పు తీర్చడమనేది అప్పు తీసుకున్నంత తేలిక కాదు గనుక నానా బాధలు పడుతుంటారు. అలాంటి కష్టాలుపడేవాళ్లు 'గజేంద్ర మోక్షం' పారాయణం చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షం పారాయణం చేయడం వలన, ధన సంపాదనకు అప్పటివరకూ వున్నఅడ్డంకులు తొలగిపోయి మంచి మార్గాలు కనిపిస్తాయి. ధనంతో పాటు కీర్తి .. ఆపై మోక్షం కూడా లభిస్తాయి. అందుకు అనునిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో 'గజేంద్ర మోక్షం' పారాయణం చేయవలసి ఉంటుంది.    
Fri, Dec 28, 2018, 06:22 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View