రామేశ్వరంలోని ఈ తీర్థాల విశిష్టత ఇదే
పరమపవిత్రమైన ప్రాచీన క్షేత్రంగా .. జ్యోతిర్లింగాలలో ఒకటిగా 'రామేశ్వరం' ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో 22 తీర్థాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఒక్కో తీర్థం ఒక్కో ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ 22 తీర్థాలలో 'జటా తీర్థం' .. 'కోటి తీర్థం' .. గురించిన విశేషాలు తెలుసుకుందాం. రామేశ్వరానికి సమీపంలో ధనుష్కోటి మార్గంలో 'జటా తీర్థం' కనిపిస్తుంది.

రావణ సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో ముందుగా తన జటలను తడుపుకుని ఆ తరువాత స్నానం చేశాడట. అందుకే ఈ తీర్థానికి 'జటా తీర్థం' అనే పేరు వచ్చింది. ఇక 'కోటి తీర్థం' విషయానికి వస్తే, విశాలాక్షి అమ్మవారికి తూర్పు వైపున ఈ తీర్థం కనిపిస్తుంది. తన మేనమామ అయిన కంసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఇలా శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు స్నానమాచరించిన ఈ తీర్థాలు దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తాయి .. సమస్త  పాపాలను హరిస్తాయి.
     
Thu, Dec 20, 2018, 06:17 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View