దృష్టి దోషాలను తొలగించే అభిషేక తైలం
చెన్నై ప్రాంతంలోని పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో 'తిరువొట్రియార్' ప్రధానంగా కనిపిస్తుంది. చెన్నై శివారు ప్రాంతంలోని ఈ క్షేత్రంలో సదా శివుడు త్యాగరాజస్వామి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అక్కడి శిల్ప సౌందర్యం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక చింతనను మరింతగా పెంచుతుంది.

స్వామి స్వయంగా వచ్చి తన భక్తుడైన సుందరుని వివాహాన్ని జరిపించింది ఇక్కడే. ఆ వివాహం ఇక్కడి చెట్టుకిందే జరిగిందని అంటారు .. ఆ చెట్టును ఇప్పటికీ చూడొచ్చు. సాక్షాత్తు స్వామివారు నడయాడిన ప్రదేశం కావడంతో, భక్తులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. ఇక్కడ స్వామివారికి జరిగే తైలాభిషేకం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ తైలం పిల్లల దృష్టి దోషాలను తొలగిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. చెన్నై వచ్చిన భక్తులు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. త్యాగరాజస్వామివారి అనుగ్రహంతో ధన్యులవుతుంటారు.   
Thu, Dec 13, 2018, 06:10 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View