నాగ దోషాలు తొలగించే కుక్కె సుబ్రమణ్యస్వామి
సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో 'కుక్కె సుబ్రమణ్యస్వామి' క్షేత్రం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. తారకాసుర సంహారం వలన సంక్రమించిన బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం, స్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. గర్భాలయంలోని స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.

ఈ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేయడం వలన, 'నాగ దోషాలు' తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో అనేక పుట్టలు దర్శనమిస్తూ ఉంటాయి. అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా వున్నాడని భావిస్తుంటారు. స్వామివారి లీలా విశేషాలను తెలిపే ఎన్నోకథలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వున్న ఒక సెలయేరును 'కుమారధార' అని పిలుస్తారు. అసుర సంహారం అనంతరం కుమారస్వామి తన 'శక్తి' ఆయుధాన్ని ఈ సెలయేరులోనే కడిగాడట. అందువల్లనే దానిని 'కుమారధార' అని పిలుస్తుంటారు.   
Fri, Nov 30, 2018, 05:00 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View