శివుడి సన్నిధిలో చేసే దీపారాధన ఫలితం
తెలుగు మాసాలలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేక వుంది .. మరెంతో విశిష్టత వుంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో చేసే దీపారాధన అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో సాయంత్రం వేళలో శివాలయంలో దీపారాధన చేయడం ఎంతో మంచిది. 

ఆవునెయ్యిలో వేపనూనె కలిపి శివుడి సన్నిధిలో దీపారాధన చేయడం వలన 'విజయం' చేకూరుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక ఆవునెయ్యితో మాత్రమే చేసే దీపారాధన వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనెతో చేసే దీపారాధన వలన సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు చేకూరతాయి. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయడం వలన .. శివుడికి దీపం చూపించడం వలన ఏ జన్మలోను దృష్టిలోపం ఏర్పడదు .. అపమృత్యు దోషాలు తొలగిపోతాయనేది మహర్షుల మాట.   
Fri, Nov 02, 2018, 06:03 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View