కలలో ఇవి కనిపిస్తే మంచే జరుగుతుంది
కలలు కనని వారంటూ వుండరు .. తమకి వచ్చిన కలను గురించి ఆలోచన చేయనివారూ వుండరు. మంచి కల వస్తే ఉదయాన్నే ఆ కలను గురించి చెప్పుకుని ఆనందించడం .. పీడకల వస్తే ఆ కలను గురించి చెప్పుకుని ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కలలు ఆందోళన కలిగించినా, ఆ కలల ఫలితం మాత్రం మంచిగానే ఉంటుందని అంటారు.

ఒక్కోసారి నీళ్లలో మునిగిపోతున్నట్టుగా కల వస్తుంది. నిజంగానే మునిగిపోతున్నామనుకుని ఉక్కిరిబిక్కిరవుతూ లేచి కూర్చుంటాము. ఏదైనా ప్రమాదం జరగనుందేమోనని కంగారు పడుతుంటాము. కానీ ఈ విధమైన కల రావడం వలన లాభం చేకూరే పనులే జరుగుతాయి. ఇక ఇంట్లో ఉండగా పైకప్పు ఒక్కసారిగా విరిగినట్టుగా కలలో కనిపిస్తుంది. మీద పడిపోతుందేమోనని దిగ్గున లేస్తుంటాము. ఈ విధమైన కల రావడం వలన కూడా శుభమే జరుగుతుంది. కొన్ని చెడుగా అనిపించిన కలలు .. మంచినే చేస్తాయి గనుక, కంగారు పడవలసిన పనిలేదు.      
Thu, Nov 01, 2018, 05:37 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View