లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించే మోతీ శంఖం
జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి .. అయితే ఆర్ధికపరమైన ఇబ్బంది అన్నిటికంటే పెద్దసమస్యగా కనిపిస్తుంది. ఆపదలు .. అనారోగ్యాలు కలిగినప్పుడు డబ్బు చేతిలో వుంటే చాలావరకూ ధైర్యంగా అనిపిస్తుంది. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే డబ్బే చేతిలో లేనప్పుడు సహజంగానే అధైర్యం కలుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బంది మరి దేని గురించి ఆలోచించే శక్తి లేకుండా చేస్తుంది. ఎవరికీ సాయం చేయలేని నిస్సహాయులను చేస్తుంది. ఆనందాన్ని ఆవిరిచేస్తూ నిరాశకి నీరుపోస్తుంటుంది.

అలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ తల్లి ప్రీతి చెందుతుంది. ఏ ఇంట అతిథులు గౌరవించబడుతుంటారో ఆ ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపుతుంది. ప్రేమానురాగాలను కలిగిన ఇంట .. పెరటిలో అరటి చెట్టు వున్న ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఇక ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో 'మోతీ శంఖం' వుంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక వుంటుంది. 'మోతీ శంఖం' పూజా మందిరంలో ఉండటం వలన, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.            
Fri, Aug 17, 2018, 05:43 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View