అంకితభావంతో అమ్మవార్ల ఆరాధన
లక్ష్మీదేవి .. దుర్గాదేవి .. సరస్వతీ దేవి ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దారిద్ర్యాన్ని దూరం చేసి సంపదలు సమకూరేలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ ఉంటుంది. దుర్గతులను .. దుఃఖాన్ని దూరం చేసి, సకల శుభాలను దుర్గాదేవి ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక బుద్ధికి అధిదేవత అయిన సరస్వతీదేవి .. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానమే కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. అందువలన ఈ ముగ్గురు అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు.

ఎర్రని పూలతో .. తెల్లని పూలతో పూజ .. అరటిపండ్లు - పాయసం నైవేద్యం లక్ష్మీదేవికి ఇష్టమైనవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక దుర్గాదేవి పూజలోను ఎర్రటి పూలనే ఉపయోగించాలి. పొంగలి .. పులిహోర .. దానిమ్మ పండ్లు అమ్మవారికి ప్రీతికరమైనవి. ఇక సరస్వతీదేవి విషయానికి వస్తే ఆ తల్లి పూజలో తెల్లని పువ్వులు వాడవలసి ఉంటుంది. కొబ్బరి .. అరటిపండ్లు .. పాయసం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు. అంకితభావంతో ఈ ముగ్గురు అమ్మవార్లను ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.     
Copyright © 2017; www.ap7am.com