లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి
జీవితం ఆనందంగా .. సంతోషంగా .. సాఫీగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆపదలు .. అనారోగ్యాలు .. ఇతర సమస్యలు అతలా కుతలం చేస్తుంటాయి. అలాంటివాటి నుంచి బయటపడటానికి ధనం ఎంతో అవసరమవుతూ ఉంటుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా .. కొన్ని పరిస్థితుల నుంచి బయటపడటానికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

అలాంటి ధనాన్ని ప్రసాదించేది లక్ష్మీదేవి అనే విషయం తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఆ తల్లి సంపదకు లోటు లేకుండా చూస్తుంది. ఆ తల్లి ప్రీతి చెందేలా చేయడం వల్లనే అనుగ్రహం లభిస్తుంది. అనునిత్యం లక్ష్మీదేవిని పూజించడం వలన .. ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు జరిపించడం వలన అమ్మవారు ప్రీతి చెందుతుంది. తల్లిదండ్రులను .. అతిథులను సేవించేవారి ఇంట, దానధర్మాలు చేస్తూ .. మూగజీవాల పట్ల దయను చూపించే వారియందు అమ్మవారు ప్రీతిని కలిగి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.               
Copyright © 2017; www.ap7am.com