బిల్వదళ జలంతో శివుడికి అభిషేకం!
పరమ శివుడికి బిల్వ దళాలంటే మహా ప్రీతి. అందువలన ఆయనని బిల్వ దళాలతో పూజిస్తూ వుంటారు. బిల్వదళాలతో స్వామిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక బిల్వదళాలు వేయబడిన జలంతో శివుడికి అభిషేకం చేయడం వలన భోగభాగ్యాలు కలుగుతాయని అంటున్నాయి.

ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన .. ఒక్కో అభిషేక ద్రవ్యం ఉపయోగించడం వలన .. ఒక్కోరకమైన పుష్పాలను వాడటం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే సదాశివుడి అభిషేకం బిల్వదళాలతో కూడిన జలంతో చేయడం వలన భోగభాగ్యాలు లభిస్తాయని చెప్పబడుతోంది. అందువలన ప్రతి సోమవారం రోజున .. విశేషమైన పర్వదినాల్లోను .. మహాశివరాత్రి రోజున శివుడికి బిల్వదళాలతో కూడిన జలంతో అభిషేకం చేయడం మరిచిపోకూడదు.         
Copyright © 2017; www.ap7am.com