రుక్మిణీ కల్యాణం పఠన ఫలితం!
యుక్త వయసులోకి అడుగు పెట్టిన అమ్మాయిలు తమ వివాహాన్ని గురించి ఎన్నో కలలు కంటూ వుంటారు. తమ కల్యాణం వైభవంగా జరగాలనీ, అందగాడు .. మంచి మనసున్నవాడు భర్తగా లభించాలని కోరుకుంటూ వుంటారు. తమ వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని ఆశిస్తూ వుంటారు. ఇక వివాహమై కొన్ని కారణాల వలన భర్తకి దూరంగా వుండేవాళ్లు వుంటారు. అలాంటి వాళ్లు తమ మధ్య గల మనస్పర్థలు తొలగిపోయి తాము ఒకటిగా కలిసిపోయే క్షణాల కోసం ఎదురుచూస్తుంటారు.

ఇక యువకులు కూడా తమకి తగిన కన్య లభించాలని భావిస్తుంటారు. తమని అర్థం చేసుకునే అర్థాంగి రావాలని ఆశిస్తుంటారు. అలాంటి వాళ్లంతా 'రుక్మిణీ కళ్యాణం' గ్రంధాన్ని చదువుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీ కృష్ణుడిపై రుక్మిణీదేవి మనసు పారేసుకోవడం .. తనకి ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి పీటలపై కూర్చోవలసి రావడం .. దాంతో ఆమె శ్రీ కృష్ణుడికి కబురు చేయడం .. సమయానికి ఆయన వచ్చి ఆమెను ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి 'రుక్మిణీ కల్యాణం' గ్రంధాన్ని చదవడం వలన ఇష్టపడిన వారితో వివాహం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.    
Copyright © 2017; www.ap7am.com