మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం!
బంగారు శివలింగం .. ఇత్తడి శివలింగం .. రాగి శివలింగం .. స్పటిక శివలింగం .. మట్టి శివలింగం .. ఇలా వివిధ రకాల శివలింగాలలో, ఒక్కో రకం శివలింగానికి అభిషేకం చేయడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ద్రాక్ష రసం .. నేరేడు పండ్ల రసం .. చెరుకు రసం .. మామిడి పండ్ల రసం .. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో పరమశివుడికి అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

 మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి. జీవితంలో ధన ధాన్యాలకి లోటు రాకూడదనే అంతా కోరుకుంటారు. అందుకోసమే ఎన్నో కష్టాలు పడతారు. అలాంటి వాళ్లు మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే, ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి ఈ విధంగా అభిషేకం చేయడం వలన, ధనధాన్యాలు సమకూరతాయి.    
Copyright © 2017; www.ap7am.com