వైశాఖ శుద్ధ సప్తమి ప్రత్యేకత!
ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడు ప్రాచీన కాలం నుంచి పూజించబడుతున్నాడు. దేవతలు .. మహర్షులు నిత్యం సూర్య భగవానుడిని పూజిస్తూనే వుంటారు. సమస్త లోకాలకు వెలుగును ప్రసాదిస్తూ ..  జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే సూర్యుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో అంతా ఆరాధిస్తూ వుంటారు. అలాంటి సూర్యభగవానుడిని వైశాఖ శుద్ధ సప్తమి రోజున పూజించడం వలన విశేషమైన ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 వైశాఖ శుద్ధ సప్తమిని 'నింబ సప్తమి' ..  అంటారు. ఈ రోజున వేప చెట్టుకు నమస్కరించి కొంచెం వేపాకును రుచి చూడాలనీ .. అలాగే సూర్యభగవానుడిని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ సప్తమిని 'కమల సప్తమి' అనీ .. 'శర్కరా సప్తమి' అని కూడా అంటారు. ఈ రోజున బంగారు తామర పూవులో సూర్యుడి ప్రతిమను ఉంచి పూజించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన .. ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.      
Copyright © 2017; www.ap7am.com