అక్షయ తృతీయ ప్రత్యేకత
వైశాఖ శుద్ధ తదియ రోజును అక్షయ తృతీయగా చెబుతారు. ఈ రోజున చేసే పూజలు .. దాన ధర్మాల వలన అక్షయమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కృతయుగం ఈ తదియ రోజునే ఆరంభమైందని అంటున్నాయి. శ్రీ మహా విష్ణువు ఆరవ అవతారంగా పరశు రాముడు జన్మించినది ఈ రోజునే.

 పితృవాక్య పరిపాలకుడిగా పేరుగాంచిన పరశురాముడు, భక్తిలోను .. శక్తిలోను తనకి తిరుగులేదనిపించుకున్నాడు. తన తండ్రిని సంహరించినందుకు గాను 21 మార్లు క్షత్రియులపై దండయాత్ర చేసి, తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. ఇక కన్నడలో వీర శైవ సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన బసవేశ్వరుడు జన్మించింది కూడా ఈ రోజునే. వీర శైవానికి చెందిన ఎంతోమంది భక్తులు ఆయనని ఆరాధిస్తుంటారు .. ఆయన మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఈ రోజున పరశురాముడిని .. బసవేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాలి.       
Copyright © 2017; www.ap7am.com