కొబ్బరి నీళ్లతో అభిషేక ఫలితం
భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అనేక మంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివుడు అభిషేకం ద్వారా ప్రీతి చెందుతాడు. ఒక్కో రకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉన్నట్టుగానే, ఒక్కో రకం అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 పాలతోను .. పెరుగుతోను .. నెయ్యితోను .. తేనెతోను .. కొబ్బరి నీళ్లతోను స్వామిని అభిషేకించడం జరుగుతూ ఉంటుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన .. దుఃఖం నశిస్తుందనేది మహర్షుల మాట. జీవితంలో ఆపదలు .. అనారోగ్యాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు .. అవమానాలు దుఃఖాన్ని కలగజేస్తుంటాయి. దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంది. అలాంటి దుఃఖానికి దూరంగా వుండాలంటే, పరమశివుడిని అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకించవలసి వుంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.          
Copyright © 2017; www.ap7am.com